పెద్దపప్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపైన్ గురించి శిక్షణ కార్యక్రమం
పెద్దపప్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు లెప్రసి కేస్ డిటెక్షన్ క్యాంపైన్ గురించి శిక్షణ కార్యక్రమం
జనచైతన్య న్యూస్- పెద్దపప్పూరు
అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో డాక్టర్ ఎస్ ఉషారాణి ఆధ్వర్యంలో పెద్దపప్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపైన్ గురించి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి డాక్టర్ మాట్లాడుతూ ఈకార్యక్రమం 18 జులై 2024 నుండి 2 ఆగస్టు 2024 తేదివరకు ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి స్పర్శ లేని రాగి, రంగు మచ్చలు ఉన్నవారిని గుర్తించి వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపాలన్నారు. కొత్త కేసులని గుర్తించడం వలన సమాజంలో వ్యాధి వ్యాప్తిని, వారిని వికలాంగత్వం నుండి కాపాడవచ్చన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం వ్యాధి లక్ష్యణాలు దాగి ఉన్నవారిని గుర్తించాలాన్నారు. ఈకార్యక్రమం లో భారతి సి హెచ్ ఓ , సి శ్రీనివాసులు మలేరియా సబ్ యూనిట్ అధికారి, శర్మష్ వలి ఆరోగ్య పర్యవేక్ష్యకులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.