మైనారిటీ వర్గాలకు సీఎం జగన్ తీవ్ర ద్రోహం

మైనారిటీ వర్గాలకు సీఎం జగన్ తీవ్ర ద్రోహం

మైనార్టీల వర్గాలకు జగన్ తీవ్ర ద్రోహం..

మైనార్టీల పక్షపాతి చంద్రబాబు.

టీడీపీ తోనే ముస్లిం మైనార్టీలకు న్యాయం

మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి

ఓడి చెరువు:31 

ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేశారని మాజీ మంత్రి డాక్టర్ పల్లి రఘునాథరెడ్డి విమర్శించారు. ఆదివారం ఓడి చెరువు లో ముస్లిం మైనార్టీల సోదరులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీల వర్గాలకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేసిందని దుయ్యబట్టారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోనే  ముస్లిం మైనార్టీలకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. వారికి అన్ని విధాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి టీడీపీ  తగిన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. టిడిపి హయాంలో హజ్ యాత్ర వెళ్ళే పేద ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆఖర్చు భరించేలా చర్యలు తీసుకుందన్నారు. అప్పటి మైనార్టీ మంత్రి గా తనకు అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కు అల్లా దీవెనలతో ముస్లింలకు సేవ చేసే భాగ్యం నాకు కలిగినందుకు జీవితాంతం చంద్రబాబు కు రుణపడి ఉంటాను. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల  అభివృద్ధికి సుమారు 1300 కోట్లతో బడ్జెట్ కేటాయింపులు జరిగాయి.అత్యదిక మసీదు ,ఈద్గా మరమ్మత్తుల కోసం జిల్లాకు రూ.2.50 కోట్లతో సుమారు 25 కోట్లు ఖర్చు చేసిందన్నారు. మసీదుల్లో పనిచేసే ఇమాంలకు నెలకు రూ.5000 చొప్పున, మోజం లకు రూ.4000 చొప్పున అందించామన్నరు.రాష్ట్రంలో  సుమారు 14590 ఎకరాలు  అన్యాక్రాంతం అయినా మైనార్టీ  వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.  కడప , విజయవాడలో హజ్ హౌస్ ల కోసం ఒకదాని కోసం 10 కోట్లు బడ్జెట్ విడుదల చేసి వాటిని నిర్మాణం చేసినట్లు గుర్తు చేశారు పుట్టపర్తి నియోజకవర్గంలో మసీదులు ఈద్గా నిర్మాణానికి అధిక బడ్జెట్ను తీసుకొచ్చిన ఘనత కూడా తనకే దక్కుతుందన్నారు. పుట్టపర్తిలో రూ.1.50 కోట్ల తో బుక్కపట్నం లో రూ.50 లక్షలతో షాది ఖానాల నిర్మాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు అన్ని మండల కేంద్రాల్లో ఉన్న ఒక్కొక్క మసీదు ,ఈద్గాల నిర్మాణానికి 20 లక్షలు 30 లక్షల వరకు మంజూరు చేసిన విషయాన్ని ముస్లిం సోదరులకు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు మంచి ఆలోచన చేసుకొని టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో  మండల కన్వీనర్ జయ చంద్ర, మాజీ జెడ్పీటీసీ పిట్టా ఓబుల్ రెడ్డి , సర్పంచ్ శంకర్ రెడ్డి , ఎంపిటిసి శ్రీనివాసులు, టిడిపి, జనసేన,బీజీపీ మైనార్టీ నాయకులు తుమ్మల మహబూబ్ బాషా, అబ్దుల్లా,పొగాకు డాక్టర్ జాకీర్, నిజాం , అరిఫ్ ఖాన్ , చాంద్ బాషా,షబ్బీర్ ,అంజీనప్ప,  షాను, షానవాజ్ , ఇర్షద్ , తెలుగు యువత అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, పీట్ల సుధాకర్, మీసేవ సుధాకర్, సురేష్ ,గంటా శ్రీనివాస్, నారపరెడ్డి, సాంబ  టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.