ఘనంగా డా బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు
అనంతపురం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండల కేంద్రమునందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ దండోరా కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిపత్రి నియోజకవర్గం ఇంచార్జ్ పెద్దపప్పూరు ఈ ఆదినారాయణ మాదిగ పెద్దపప్పూరు మండల సిపిఐ కార్యదర్శి చింతా పురుషోత్తం తాడపత్రి నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఉపాధ్యక్షుడు రామాంజనేయులు మాదిగ హాజరైనందు మహనీయుని కిఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ ఆదినారాయణ మాదిగమాట్లాడుతూ జజ్జివన్ రామ్ నాయకత్వం వ్యక్తిత్వం సేవ ప్రజాస్వామిక వ్యవస్థకు గొప్ప బలాన్ని చేకూర్చుపెట్టారని అంతేకాక హరిజన సేవా సంఘం కార్యదర్శిగా ఉన్నప్పుడు బీహార్ రాష్ట్రంలో భూకంపం స్థంభవించినప్పుడు సహాయ కార్యక్రమాల్లో కూడా సహాయ సహకారాలు అందించాడని అట్టడుగు వర్గాల వారికోసం మరియు దళిత జాతుల పట్ల అవలంబించే అంతారానితనం మరియు అవమానం జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి దళిత ప్రజలను ముకుమ్మడి చేసి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన గొప్ప మహోన్నత వ్యక్తి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో లైబ్రరీ ఆదిమూర్తి ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పోలేరప్ప మాదిగ మాదిగ మహిళా నాయకులు రామ్ సుబ్బమ్మ , గ్రామస్థులు, పెద్దఎత్తున పాల్గొన్నారు