మరింత సంక్షేమం జగనన్నతోనే సాధ్యం

మరింత సంక్షేమం జగనన్నతోనే సాధ్యం
సత్యసాయి జిల్లా :అమడుగురు ఏప్రిల్ 12: జన చైతన్య న్యూస్:
మండల కేంద్రంలోని చీకిరేవులపల్లి పల్లి పంచాయతీ రెడ్డివారి పల్లి,సీతిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి, సీతిరెడ్డిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పుట్టపర్తి శాసనసభ్యులు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి తనయుడు దుద్దుకుంట కిషన్ రెడ్డి గ్రామంలో ఇంటింటికి తిరిగి అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ నియోజకవర్గంలో దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి చేసిన అభివృద్ధితెలియచేస్తు. జగనన్న చెప్పిన ప్రతి మాట చేతల్లో చేసిన నాయకుడుఅని చెప్పారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి జగనన్నను మరోసారి సీఎం చేసుకోవాలని దుద్దుకుంట కిషన్ రెడ్డి ప్రజలను కోరారు. అలాగే పుట్టపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి నీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సూర్యనారాయణరెడ్డి, శివశంకర్ రెడ్డి, గజ్జల ప్రసాద్ రెడ్డి, కస్సముద్రం శ్రీధర్ రెడ్డి.హరి రెడ్డి, తనకంటి జయప్ప,బాబ్జాన్ , గోపి, శ్రీకాంత్, మణికంఠ, మండల సర్పంచులు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు,కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.