ఫ్యాను కోసం పని చేసి,అదే ఫ్యానుకు ఉరి వేసుకునే పరిస్థితిలో సర్పంచులు*

*ఫ్యాను కోసం పని చేసి,అదే ఫ్యానుకు ఉరి వేసుకునే పరిస్థితిలో సర్పంచులు*
*సొంత గూటికి చేరిన నిడి మామిడప్ప*
*వైసిపి నుండి తెదేపా లోకి పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారి సమక్షంలో 23 వడ్డేర కుటుంబాలు,*
శ్రీ సత్యసాయిజిల్లా గోరంట్ల మండలం రెడ్డిచేరువుపల్లి పంచాయతీ వడ్డీపల్లి లో వైసిపి కి షాక్ తగిలింది,వైసిపి పార్టీ నుండి మాజి సర్పంచు నీడిమామిడప్ప సొంత గూటికి చేరారు,పెనుకొండ నియొజకవర్గ తెదేపా,జనసేన,బీజెపి ఉమ్మడి పార్టి అభ్యర్థి *సవితమ్మగారి* సమక్షంలో,,రాష్ర్ట వడ్డెర సాదికారీక కన్వీనర్ వడ్డె వెంకట్ ఆధ్వర్యంలో నిడి మామిడప్ప తో పాటు 23 వడ్డెర కుటుంబాలు తేదేపా తీర్థం పుచ్చుకున్నాయి,ఈ సందర్భంగ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ మీడియతో మాట్లాడూతు ఒక్క ఛాన్స్ అంటు అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను ఇబ్బంది పెట్టి,రాష్ర్టాన్ని నాశనం చేసి,సర్పంచుల భవిత అదోగతీ చేసాడని,ఏ ఫ్యాను కోసం పని చేసారో,ఆ సర్పంచులు,నాయకులు అదే ఫ్యానుకి ఉరి వేసుకునే పరిస్థితికి వారిని తీసుకోచ్చాడు.
నిడి మామిడప్ప మళ్లీ తెదేపాలోకి రావడం శుభ పరిణామం అని,గోరంట్ల మండలంలో తేదేపాకు అత్యధిక మెజారిటీ తెదేపాకు వస్తుందన్నారు,ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.....