తాడేపల్లిగూడెం సభతో జనసేన విజయకేతనం ఖాయం

తాడేపల్లిగూడెం సభతో జనసేన విజయకేతనం ఖాయం

తాడేపల్లి సభతో టిడిపి- జనసేన విజయకేతనం ఖాయం

విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్ )

తెలుగు జన విజయ కేతనం సభ విజయవంతం అవుతుందని భారీగా ప్రజలు హాజరవుతున్నారని తెలిసి సిద్ధం సభను వాయిదా వేసుకున్న సీఎం జగన్.

పవన్ కళ్యాణ్ చంద్రబాబు గార్ల ఉమ్మడి నాయకత్వం పై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉంది.  రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి విజయకేతనం ఖాయం వైసీపీ పతనం తథ్యం.

చలో తాడేపల్లి సభకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి 4 బస్సులు 40 కార్లతో బయలుదేరిన జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం

ఇంచార్జ్ నగర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. తెలుగు జన విజయకేతనం సభ సభకు బయలుదేరుతున్న బస్సులకు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, గుజారి అమర్, రాయల్ సేన ఈశ్వర్, పిల్లా శ్రీనివాసరావు, గోపిశెట్టి వెంకన్న, పోతిన సాంబశివరావు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు.

ప్రచార కమిటీ విజయవాడ అర్బన్ సమన్వయకర్త తిరుపతి సురేష్ చలో తాడేపల్లి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.