ఓబులదేవర చెరువు మండలం జన చైతన్య న్యూస్

Obuladevaracheruvu mandalam Jana chaithanya news

ఓబులదేవర చెరువు మండలం జన చైతన్య న్యూస్

జన చైతన్య న్యూస్ 31

ప్రకృతి వ్యవసాయం సాధనలో ఉమ్మడి అనంతపురం జిల్లా లో శ్రీ దినేష్ గారు మూడు దశాబ్దాలకు పైగా విశేషమైన కృషి చేయడం జరిగింది  ఈరోజు కదిరి కుమ్మరి వాండ్లపల్లిలో కలవారి చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ సందర్శించిన బిజెపి ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి వారితో కలిసి ప్రకృతి వ్యవసాయం వస్తున్న సవాళ్లు రైతులకు చేరుకోడాల్సిన మార్గాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది వారి అనుభవాలను మరియు సమాజంలో ఆహారం పైన ప్రజలకు కల్పించాల్సిన అవగాహన ఇతర అంశాల గురించి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా వారికి శాలువతో సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ ప్రాంతంలోని రైతులు వేరుశనగ పంటను విపరీతంగా వేయడం పంటకు కావలసినటువంటి రసాయనాలు విపరీతంగా భూమిపై చల్లడం వలన భూమి లోపల పోషకాలను నశించిపోయాయి గతంలో ఒక ఎకరం వేరుశనగ పంటకు 30 సెర్లు విత్తనాలు వేసేవాళ్ళని రైతుల ఆదాయం కోసం వాటిని 60 సేర్లు విత్తనాలకు పెంచారు కానీ పంటకు కావలసినటువంటి ఎరువులను సత్తువను చేయడం మర్చిపోయారని దాంతో వేరుశనగ పంట 30 బస్తాల నుండి 8 బస్తాలకు దిగుబడి దిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వేరుశనగలు అంతర్పంట మరియు పంట మార్పిడి ద్వారా చిరుధాన్యాలు వేయడంతో భూసారం పెరిగి రైతులకు ఆదాయం వచ్చే విధంగా వేరుశనగ పంట పండుతుందని తెలియజేశారు. వేరుశనగ విత్తనాలు సబ్సిడీపై ఇచ్చిన విధంగానే చిరుధాన్యాలను రైతులకు సబ్సిడీలపై పంట వేసుకున్నందుకు ఇవ్వాలని ఈ సందర్భంగా శరత్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో రామాంజుల రెడ్డి గంగాధర్ శ్రీనాథ్ రెడ్డి రమేష్ బాబు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు