ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ గారి సతీమణి యశోదమ్మ గారు

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి అభ్యర్థి శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి సతీమణి యశోదమ్మ గారు
జన చైతన్య న్యూస్- కదిరి
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలుగుదేశం,జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ ని సైకిల్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన సత్యం అని కందికుంట యశోదమ్మ కదిరి పట్టణం మూడవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ఏ ఇంటి వద్దకు వెళ్ళినా ఒకే మాట ఈసారి మా ఓటును కచ్చితంగా మా మంచి చెడ్డలో మాకు తోడుగా ఉండే కందికుంట వెంకటప్రసాద్ కె వేస్తం అంటూ ప్రజలు తెలుపుతున్నారు.అబద్ధపు మాటలతో,బూటకపు హామీలతో రాష్ట్ర ప్రజలపై భస్మాసురా హస్తం మోపుతూ పేద మధ్య తరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు అద్దాలమేడలో గడిపిన ఈ జగన్మోహన్ రెడ్డి కోట ఎముకలు వస్తున్న తరుణంలో వరదాల చాటున ప్రజలకు వస్తూనే మరొక కొత్త డ్రామాకు తెరలేపాడు.అదే గులకరాయి దాడి,సానుభూతి కోసం ఓట్లను దండుకోవడం కోసం నువ్వు చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు.రాబోయేది జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వ అని గుర్తుపెట్టుకో,ఐదు సంవత్సరాలుగా మీరు చేసిన అవినీతిని బయటపెట్టి నిన్ను జైలు పంపించడం ఖాయం.20 సంవత్సరాలుగా కదిరి నియోజకవర్గం ప్రజల కోసం, అభివృద్ధి కోసం శ్రమిస్తూ పార్టీ గెలుపు లక్ష్యంగా ముందుకు సాగుతున్న కందికుంట వెంకటప్రసాద్ అడ్డుకోవడం కోసం కదిరి ప్రాంత ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కుటుంబ సభ్యుల మాదిరిగా ఉన్న ప్రశాంతవాతావరణాన్ని నాశనం చేయాలని చూస్తే కదిరి ప్రజలు సహించరు.2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం,జనసేన,భారతీయ జనతా పార్టీల కూటమి అభ్యర్థులు గెలవడం ఖాయం, కదిరి నియోజకవర్గం లో కందికుంట వెంకటప్రసాద్ అత్యధిక మెజారిటీతో గెలవడం సత్యమంటూ జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మనోహర్ నాయుడు, బిజెపి పార్టీ మైనార్టీ నాయకులు తెలియజేశారు.