ఓబులదేవర చెరువు మండలం జన చైతన్య న్యూస్
Obuladevaracheruvu mandalam Jana chaithanya news

దశాబ్దాలుగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఎంతో మందిని స్ఫూర్తినిచ్చిన ప్రకృతి వనం ప్రసాద్ గారిని ఈరోజు బిజెపి ఆర్గానిక్ ఫార్మర్స్ స్టేట్ సెల్ కన్వీనర్ చింత శరత్ కుమార్ రెడ్డి కలిశారు రాష్ట్రంలో ఆర్గానిక్ వ్యవసాయం పెంచేందుకు బిజెపి చేస్తున్న కృషికి సహకరించాలని శరత్ కుమార్ రెడ్డి కోరారు రైతులకు తన వంతు సూచనలు సలహాలు ఇచ్చేందుకు తాను నిరంతరం అందుబాటులో ఉంటారని ప్రకృతి వనం ప్రసాద్ గారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు మదనపల్లి సమీపంలో ప్రకృతి వనంలో ప్రసాద్ గారు చేస్తున్న ఆర్గానిక్ వ్యవసాయం మరియు ఉత్పత్తుల తయారీ యూనిట్లను శరత్ కుమార్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయన ఎరువులు అధికంగా వాడడం తో భూసారం నశించిపోయి దిగుబడి తక్కువగా వస్తున్నది అని తద్వారా వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా రైతులు వేల రూపాయలు వెచ్చించి అధిక దిగుబడి కోసం రసాయనాలు ఎక్కువగా వాడడం తో పంటలు సరైన ధరలకు అమ్ముడుపోక నష్టాలు వస్తున్నాయని తెలిపారు వీటికి పరిష్కారం రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని తక్కువ ఖర్చుతో చేసుకోవాలని ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రకృతి వ్యవసాయం పండించిన పంటలు ప్రజల వాడడం కారణంగా ప్రజల్లో కూడా విపరీతమైన అనారోగ్యాలు గురవుతున్నారని అన్నారు ప్రకృతి వ్యవసాయం మాత్రమే ఈ సమాజానికి శ్రేయస్కారమని రైతులందరూ ఈ వ్యవసాయం వైపు రావాలి అని ముఖ్యంగా యువ రైతులు చదువుకున్నటువంటి వారు వీటిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు