ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.ఎస్సై హేమాద్రి

..ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.ఎస్సై హేమాద్రి..
(పుట్లూరు జనచైతన్య న్యూస్)
..ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.ఎస్సై హేమాద్రి..
ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హేమాద్రి గ్రామ ప్రజలకు హెచ్చరించారు . పుట్లూరు మండల పరిధిలోని శనగల గూడూరు గ్రామంలో ఎస్సై హేమాద్రి తన పోలీసుల యంత్రాంగం తో కలిసి మంగళవారం పర్యటించడం జరిగింది.ఆ గ్రామంలో రచ్చ కట్ట వద్ద ప్రజలతో మమేకమై గ్రామసభ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై హేమాద్రి మాట్లాడుతూ గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారించుకోవాలే తప్ప ఘర్షణ జోలికి వెళ్లకూడదని సూచించారు.అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు రోజు 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని అన్నారు. వరుసగా నేరాల్లో పాల్గొంటున్న వారిపై రౌడీ షీట్ తెరుస్తామన్నారు. వారి ప్రవర్తన మార్చుకోకపోతే చట్టపరంగా జిల్లా బహిష్కరణ చేయడానికి వెనకాడబొమని తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కూడా ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హేమాద్రి తెలియజేశారు.