స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం ముసుగు తొలగించండి
స్వాతంత్ర సమరయోధులు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు ముసుకు తొలగించాలి
విజయవాడ _ జనచైతన్య (తమ్మిన గంగాధర్)
దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కట్టె పోగు ఉదయ భాస్కర్ ఎన్నికల కమిషన్ కు వినతికేంద్రంలో ఉప ప్రధాని,రక్షణ శాఖ ఆర్థిక శాఖ ,రైల్వే శాఖ , కార్మిక శాఖ లాంటి ఎన్నో పదవులు చేపట్టి ఆ పదవులకే వన్నెతెచ్చిన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ముసుగులు వేయడం దారుణమని దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కట్టేపోగు ఉదయ భాస్కర్ సోమవారం ఒక ప్రకటనలోతెలిపారు. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచేందుకు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ ను నియమించి ఆయన సిఫార్సులను అమలు చేసి హరిత విప్లవం తీసుకువచ్చి అధిక దిగుబడులను సాధించడమే కాకుండా మిగులు ధాన్యాలను భారతదేశానికి అందించిన బాబు జగజ్జీవరావుకే ఆ ఘనత దక్కుతుందని అన్నారు. జాతీయస్థాయిలో అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందిన జాతీయ, మానవతవాది బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 5 న స్మరించుకోవడానికి ఆయన విగ్రహాలకు వేసిన ముసుగులను తొలగించే అంశంపై ఒక్కసారి పునః పరిశీలన చేయాలని ఎన్నికల కమిషనర్ కు విన్నవించారు.