ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్
సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం గంగానగారిపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కదిరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకటప్రసాదు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అన్ని వర్గాలకు సంక్షేమ అందుతుందన్నారు, చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో పేదల జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు, దీపం పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్న ఒక్కొక్క తల్లికి వందనం పేరుతో 15000 ఇస్తామన్నారు, ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతినెల రూ 1500 ఇస్తామన్నారు, యువగలం పేరుతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని 50 ఏళ్లు నిండిన బిసి,ముస్లిం మైనారిటీలకు ప్రతినెల 4 వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.