నరేంద్ర మోదీ జి గారికి పాలాభిషేకం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడిందిపుట్టపర్తి NDA కూటమి నాయకులు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూటమి నాయకులు తెలియజేశారు హనుమాన్ సర్కిల్ నందు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాపటానికి పాలాభిషేకం చేసి బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధాని నిర్మాణం కోసం స్పెషల్ సపోర్టింగ్ కింద కేంద్ర బడ్జెట్లో ఈ ఏడాదికి 15000 కోట్లు కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారాంకు పుట్టపర్తి కూటమి నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ బడ్జెట్ ద్వారా మరోసారి వెళ్లడైందని ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాధారం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రకటించడానికి స్వాగతిస్తున్నామని నాయకులు తెలియజేశారు అలాగే రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించడం ఆ ప్రాంతాల అభివృద్ధికి దోహదచేస్తుందని తెలిపారు రాష్ట్ర సంపూర్ణభివృద్ధి డబల్ ఇంజన్ సర్కార్ ఏర్పడడం వల్లే సాధ్యమైందని తెలియజేశారుఈ కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత కార్మికుల కన్వీనర్ హరికృష్ణ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు కొండమరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి రాజారెడ్డి జిల్లా మీడియా కన్వీనర్ జ్యోతి ప్రసాద్ జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ బాలగంగాధర్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సునీల్ వైట్ల పట్టణ అధ్యక్షుడు సోకే రామాంజనేయులు ప్రధాన కార్యదర్శి నారాయణ కళ్యాణ్నా రాయణ స్వామి సతీష్ టిడిపి నాయకులు బెస్త చలపతి సామకొటి ఆది గూడూరు ఓబులేసు తదితరులు నాయకులు పాల్గొన్నారు