*ఉరకలెత్తే ఉత్సాహంతో వైఎస్ఆర్సిపి నాయకుల భారీ బైక్ ర్యాలీ
*ఉరకలెత్తే ఉత్సాహంతో వైఎస్ఆర్సిపి నాయకుల భారీ బైక్ ర్యాలీ*
తనకల్లు: *మేము సిద్ధం జగనన్న కోసం..*
*మేము సిద్ధం వైఎస్ఆర్ సీపీ గెలుపు కోసం..*
*మేము సిద్ధం ప్రజా ప్రభుత్వం కోసం..* అంటూ వైఎస్ఆర్ సీపీ నాయకులు తనకల్లు మండల కేంద్రం నుంచి నల్లచెరువు, గాండ్లపెంట మండలాల మీదుగా రాచినేపల్లి వరకు 200 ద్విచక్ర వాహనాలతో నిర్వహించిన భారీ ర్యాలీలో కదిరి వైఎస్సార్ సీపీ ఎమ్మేల్యే అభ్యర్థి బి.ఎస్ మక్బూల్ పాల్గొన్నారు. అనంతరం బండకాడపల్లి, రాచినేపల్లి, దిగువ హరిజనవాడ, ఎగువ హరిజనవాడ, కాట్నేపల్లి, పాముదుర్తివారి పల్లి గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ..
*ప్రచారంలో బ్రహ్మరధం పడుతూ మా ఓటు జగనన్నకే అని చెబుతున్న గ్రామస్తులకు చేతులెత్తి నమస్కరిస్తున్న.*
*సంక్షేమం అందిస్తున్న జగనన్నను తప్ప పొత్తులు పెట్టుకున్న చంద్రబాబును నమ్మమని ప్రజలే చెబుతున్నారు.*
*నవరత్నాల పథకాలు ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో లబ్ధి పొందిన వారు ఉన్నారు.*
*మరో నాలుగు రోజుల్లో ప్రజలు మెచ్చే మేనిఫెస్టో జగనన్న విడుదల చేయనున్నారు.*
*గతంలో బాబొస్తే జాబొస్తొంది అని అబద్ధాలు చెప్పిన చంద్రబాబు ఇపుడు సూపర్ సిక్స్, భరోషా అంటూ అమలు చేయలేని హామీలు చెబుతున్నాడు.*
*డ్వాక్రా మహిళలను సైతం మోసం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుంది.*
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, మాజీ సమన్వయకర్త ఎస్ఎండి ఇస్మాయిల్, వైఎస్ఆర్సిపి నాయకులు సాదత్ అలీఖాన్, మాజీ టెంపుల్ చైర్మన్ గోపాలకృష్ణ, మండల వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.