యువత ఆధ్వర్యంలో పల్లె పల్లెకు సైకిల్ యాత్ర.
యువత ఆధ్వర్యంలో పల్లె పల్లెకు సైకిల్ యాత్ర.
(పుట్లూరు జనచైతన్య న్యూస్)
పుట్లూరు మండలంలో స్థానిక యూత్ అధ్యక్షుడు వీ. రవి ఆధ్వర్యంలో మంగళవారం బాబు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా విస్తృత ప్రచారం కొనసాగించడానికి పల్లె పల్లెకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా యూత్ వి.రవి మాట్లాడుతూ సామాన్యుని గమ్యానికి చేర్చేది సైకిల్, సాధకుడుని విజయానికి చేర్చేది సైకిల్, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది సైకిల్ అని తెలిపారు. అదేవిధంగా ఐదు సంవత్సరాలలో వైకాపా పాలన వలన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. అంతేకాకుండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారాలంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుందని చెప్పుకొచ్చారు. ప్రజల సంక్షేమం కోసం రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ మే 13న జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి ,జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి బండారు శ్రావణి ని మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బండారు శ్రావణి ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజవర్గం అభివృద్ధి సాధ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత పాల్గొన్నారు.