వన్ టౌన్ బ్రాహ్మణు వీధి లో ఘనంగా శ్రీరామనవమి మహోత్సవ వేడుకలు-నగరాలు విజయవాడ
నేడు కొత్తపేట శ్రీ నగరాల సీతారామస్వామి దేవస్థానంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
విజయవాడ- జనచైతన్య- ( రుషిత్ కుమార్) శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఈనెల 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కొత్తపేటలోని శ్రీ నగరాల సీతారామస్వామి వారి దేవస్థానంలో శ్రీ సీతా రామ స్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మంగళవారం కొత్తపేట రామాలయం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ, కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్లాశ్రీనివాసరావు, కమిటీ మాజీ అధ్యక్షులు పోతిన బేసికంఠేశ్వరుడు మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కళ్యాణోత్సవంలో దుక్క మురళీధర్, వెంకటి దంపతులచే కల్యాణోత్సవం తలంబ్రాలు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అలాగే 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు వందేళ్ళ చరిత్ర ఉన్న దివ్య రథంపై స్వామివారి రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటలకు అన్న ప్రసాద వితరణ ,అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి పవళింపు సేవ ఉంటుందని అన్నారు. ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు శ్రీరామనవమి వేడుకలను తమ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. ఆయా కార్యక్రమాల్లో వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. సమావేశంలో కమిటీ ఉపాధ్యక్షులు మరుపిళ్ల సత్యనారాయణ, బెవర శ్రీనివాసరావు, సభ్యులు ఈది ఎల్లారావు, పణుకు రమ, ఈది ఎల్లా రాజారావు,గూడేల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో శ్రీరామనవమి వేడుకల ఆహ్వాన పత్రిక ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు.