యాడికి మండలంలో 108 అంబులెన్స్ ఉన్న లేనట్టే

యాడికి మండలంలో 108 అంబులెన్స్ ఉన్న లేనట్టే

యాడికి మండలంలో 108 అంబులెన్స్ ఉన్న లేనట్టే 

 జనచైతన్య న్యూస్- యాడికి

 అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం యాడికి మండలంలో ప్రజల అవసరాలకు అందుబాటులో లేకుండా ప్రొద్దునగా అనంతపూర్ కు వెళ్లి అనంతపురం జిజిహెచ్ లో అంబులెన్స్ పార్కింగ్ చేసి రెస్ట్ తీసుకుంటున్న డ్రైవర్స్. 108 డ్యూటీలో ఉన్నప్పుడు రెస్టు తీసుకుని డ్యూటీలు లేని టైంలో ఆర్టీసీకి డ్యూటీకి వెళ్లాలి కాబట్టి ఆ సంబంధిత పైలట్ అనంతపూర్ లో పెట్టి రెస్ట్ తీసుకుంటాడు. అలా రెస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి డ్యూటీ దిగే సమయానికి యాడికి చేరుకుంటారు. గతంలో ఇదే డ్రైవర్ ఎన్నోసార్లు ఆర్టీసీ బస్సుకు వెళ్లి తాడపత్రిలో ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ చేసినా కూడా అరబిందో యాజమాన్యం సపోర్ట్ ఉండటంతో ఆయన రెండు విధాలుగా రెస్టు లేకుండా ఆర్టీసీ, 108 రెండు చేసుకోవడం అటు ఆర్టీసీలో ప్రయాణిస్తున్న వారైనా, 108 లో ప్రయాణిస్తున్న వారైనా వారి ప్రాణాలను రిస్క్ లో పెట్టవలసి వస్తుంది. కనుక ప్రజల ప్రాణాలు కాపాడవలసిన ఎమర్జెన్సీ వెహికల్స్ లో జరుగుతున్న లోపాలు వెహికల్ మానిటరింగ్ చేయడానికి ఉన్న జిపిఆర్ఎస్ కూడా ఈ వెహికల్ లో వారు పనిచేయకుండా కేబుల్ కట్ చేస్తారు, అందువలన ఈ వెహికల్ ఎక్కడ ఉందో కూడా చూడడం ఎవరికీ అర్థం కాదు.