ఎన్నికల సుడిగాలి పర్యటనలో పాల్గొన్న మాజీ మంత్రి పల్లె,పత్తి చంద్రశేఖర్
ఓడిచెరువు మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మల్లాపల్లికి విచ్చేసిన మాజీ మంత్రి టీడీపి పుట్టపర్తి ఇంచార్జ్ పల్లె రఘనాథరెడ్డి, జనసేన ఇంఛార్జ్ పత్తి చంద్రశేఖర్ ని శాలువాలతో ఘన స్వాగతం పలికిన జనసేన నాయకులు ఈశ్వర్ మేకల, తలసాని దివాకర్ రెడ్డి.
పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని గెలిపించాలని కోరారు.పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి ఎన్డీఏ అధికారంలోకి వస్తె మాత్రమే సాధ్యం అవుతుందన్నారు.వైసిపి ప్రభుత్వంలో అభివృద్ది శూన్య అని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపి,బిజెపి,జనసేన నాయకులు,కార్యకర్తలు,మల్లాపల్లి ప్రజలు పాల్గొన్నారు.