గంగమ్మ కి ఘనంగా జ్యోతులు,బాణాలు

గంగమ్మ కి ఘనంగా జ్యోతులు,బాణాలు

గంగమ్మ కి ఘనంగా జ్యోతులు,బాణాలు 

జన చైతన్య న్యూస్-కదిరి 

సత్యసాయి జిల్లా కదిరి పట్టణం స్థానిక వెలుగు ఆఫీస్ పార్థసారథి కాలనీలో ఆదివారం గంగమ్మకు ఘనంగా జ్యోతులు బాణాలు జరిగాయి. మొదట పురవీధుల గుండ జ్యోతులు బాణాలను మోసుకుంటూ వెళ్లి సత్యమ్మ అమ్మవారికి 101 బిందె నీళ్లు 101 నిమ్మకాయల తో అమ్మవారిని అలంకరించారు,

ప్రతి ఇంట ఆడపడుచులతో జ్యోతులు బాణాలతో సత్యమ్మ గుడి చుట్టూ ప్రతిష్టలు చేసి మొక్కులు మొక్కుతూ అనంతరం గంగమ్మ దేవస్థానం వరకు జ్యోతుల బాణాలు డప్పుల వాయిద్యాలతో గంగమ్మ గుడి చుట్టూ ప్రతిష్టలు చేసి గంగమ్మకు జ్యోతుల బాణాలు సమర్పించారు. గ్రామస్తులతో భక్తులతో కలిసి గంగమ్మకు కోళ్లను పొట్టేళ్లను సమర్పించారు.తరలి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు వెలిశాయి.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దల సమక్షంలో గంగమ్మ జాతర కొనసాగుతోంది...