కొరివి పల్లి గ్రామంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో బీర సాగు ఎంచుకొని బీర అత్యధిక దిగుబడి

కొరివి పల్లి గ్రామంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో బీర సాగు ఎంచుకొని బీర అత్యధిక దిగుబడి

కొరివి పల్లి గ్రామంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో బీర సాగు ఎంచుకొని బీర అత్యధికంగా దిగుబడి 

 జనచైతన్య న్యూస్- శింగనమల

అనంతపురం జిల్లా శింగనమల మండలం కొరివి పల్లి గ్రామంలో మూడు ఎకరాల భూ విస్తీర్ణంలో బీర సాగు చేసిన రఘునాథ్ రెడ్డి, మొదటిసారిగా బీర సాగు చేసి పండించగా బీర దిగుబడి 10కోట్లకు దాదాపుగా 90 టన్నులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. బీర తీగకు ద్రాక్ష తోట లాగా కడ్డీలు ఏర్పాటు చేశామని, అలాగే సకాలంలో పంటకు తెగులు లాంటివి రాకుండా, మంచి దిగుబడి కోసం నాణ్యమైన విత్తనాలు, మందులు వాడడం మంచిదన్నారు. బీర సాగు నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే పెట్టుబడుకు మించి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే రైతు తక్కువ సమయంలో మంచి దిగుబడి, అధిక లాభాలు కావాలంటే బీర సాగు చేసుకుంటే చాలు అన్నారు.రైతులు ఏ పంట పెట్టిన ఆ పంటను నిర్లక్ష్యం చేయకుండా బాగా చూసుకుంటే ప్రతి పంటలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో కూడా రైతు రఘునాథ్ రెడ్డి అనేక పంటలలో తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి పంటలు పండించి ఎన్నో లాభాలు పొందినట్లు రైతులు ప్రశంసలు కురిపించారు.