ఎలాంటి గొడవలకు తావు లేకుండా సంయమనం పాటించాలి :-
ఎలాంటి గొడవలకు తావులేకుండా సంయమనం పాటించాలి :-
అమడగూరు జూన్(జనచైతన్య న్యూస్ ):-జిల్లా ఎస్పీ, ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దృష్ట్యా నల్లమాడ సిఐ రాజేద్రనాథ్ యాదవ్,మండల ఎస్సై మక్బూల్ బాషా ఆధ్వర్యంలో ఇరు పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఎలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయి అని ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూడా ఎలాంటి గొడవలకు వెళ్లకుండా ఇరు పార్టీ నాయకులకు సూచనలు చేసారు.144 సెక్షన్ అమలులో ఉంటుందని,పోలీస్ 30 యాక్ట్ కూడా అమలులో ఉన్నందున,ఎలాంటి అల్లర్లకు పాల్పడవద్దని,నిబంధనలకు విరుద్దంగ బాణసంచా పేల్చడం కానీ, మీటింగులు పెట్టడం కానీ చేయకూడదన్నారు. నిబంధనలకు విరుద్దంగా గొడవలకు పాల్పడితే కఠినమైన చర్యలుంటాయిన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుళ్లు రమేష్, భాస్కర్, జెబివుల్లా, భాస్కర్, రత్నాకర్, భార్గవ, చంద్ర, మున్ని, సిబ్బంది పాల్గొన్నారు.