జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసిన జాఫ్ జిల్లా అధ్యక్షుడు
జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసిన జాఫ్ జిల్లా అధ్యక్షుడు
అనంతపురం:
అనంతపురం జిల్లా కలెక్టర్ గా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి వినోద్ కుమార్ ని
జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్) అనంతపురం జిల్లా అధ్యక్షులు నాగేంద్ర యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే జాప్ నాయకులు జైపాల్, సుధాకర్ కలెక్టర్ కు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికల సందర్భంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా ముఖ్యమైన పాత్ర పోషించాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఎన్నికలు సజావుగా జరగాలంటే అధికారులు నిర్వహించే బాధ్యతలకు ఎక్కడ ఆటంకం కలుగునుండా ఉండాలంటే అధికారులతో పాటు మీడియా పాత్ర చాలా ఉంటుందన్నారు. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరగాలంటే పోలీసులు అధికారులకు స్నేహి సీలీ వాతావరణం లో వారిదిగా మీడియా రంగం ఉండేలా చూసుకోవాలని జిల్లా యూనియన్ నాయకులకు ఆయన తెలియజేశారు.
ఈ సందర్భంగా నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ గడిచిన కాలంలో జర్నలిస్టులపై చేసినటువంటి దాడులను ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు సమస్య పరిష్కారమయ్యే విధంగా సంబంధిత అధికారులు కలిసి పనిచేశామని గుర్తు చేశారు. ఎన్నికలు సజావుగా సాగడానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తామన్నారు.