పొదిలి చెందిన ఇద్దరు విద్యార్థులకు చెస్ పోటీలలో బంగారు పథకం

పొదిలి చెందిన ఇద్దరు విద్యార్థులకు చెస్ పోటీలలో బంగారు పథకం

పొదిలి బేసిక్ చెస్ అకాడమీకి చెందిన సామి నిహాల్ సువిత్(6వ తరగతి), సామి విహాల్ సువిత్(4వ తరగతి)లకు దర్శిలో ఏపీ చెస్ అకాడమీ ఒంగోలు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ పోటీలలో అన్నదమ్ములు ఇద్దరు బంగారు పతకం సాధించారు. ఈసందర్బంగా భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ జగదీశ్ చేతులమీదుగా సర్టిఫికెట్ బంగారు పతకం,జ్ఞాపిక ను అందుకున్నారు చిన్నారులు..వీరిద్దరూ దర్శి భాష్యం స్కూల్ లో విద్యనభ్యశిస్తున్నారు..స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయ సిబ్బంది కూడ ఇద్దరికి అభినందనలు తెలిపారు. కుమారులు చెస్ పోటీలలో బంగారు పతకం సందించడం పట్ల చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు సామి రవి కిషోర్, ఎబినేజర్ తెలిపారు..