ప్రజలకు ఇబ్బంది కలిగించే ఖాళీలేని డివైడర్లు

ప్రజలకు ఇబ్బంది కలిగించే ఖాళీలేని డివైడర్లు

ప్రజలకు ఇబ్బందులు కలిగే డివైడర్లుకు ఖాళీగా ఉండాలని విజ్ఞప్తి

విజయవాడ _జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

విజయవాడ _చిట్టినగర్ బంగారయ్య కొట్టు సందు ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డుకు వేసిన డివైడర్ ను ప్రజల రాకపోకలకు అనుగుణంగా ఖాళీ ఏర్పాటు చేయగలనందుకు విజ్ఞప్తి. 

గతమూడుసంవత్సరాలుగా ఈ యొక్క వన్ టౌన్ పంజా సెంటర్ నుండి చిట్టినగర్ వరకు ప్రజల సౌకర్యార్థం సిమెంట్ రోడ్డు ను  వేసి ఉన్నారు దానికి ఇరువైపులా సెంటర్లో డివైడర్ ను కూడా  ఏర్పాటు చేశారు అందుకు ఎంతో సంతోషిస్తున్నాము ప్రతిసందు సందు సందుకి మనుషులు వేలుటకు కాళీ ఏర్పాటు చేశారు.  ఈయొక్క చిట్టి నగర్ బంగారయ్య కొట్టు సందు ఎదురుగా డివైడర్ కు ఎటువంటి ఖాళీ వదలక పూర్తిగా మూసి వేశారు ఈ బంగారయ్య కొట్టే సందు నుండి కొండ మీద నుండి ప్రతిరోజు వివిధ షాపులకు ఉద్యోగాలకు స్కూళ్లకు హాస్పిటల్స్ కు వివిధ పనులకు వెళ్లేవారు వెళ్లటానికి  వీలు లేకుండా పోయింది. బంగారయ్య కొట్టు సెంటర్ బస్ స్టాప్ కూడా  ఉంది బస్సు లు ఆటోలు ఎక్కడానికి  ఆడవారు పిల్లలు పెద్ద వయసు వారు చిట్టినగర్ పెట్రోల్ బంక్ లా వద్ద డివైడర్ను ఖాళీ లేక ఆర్.సి.యం స్కూల్  వెళ్లే ఎదురుగా ఉన్న డివైడర్ వరకు వెళ్ళ వలసి వస్తుంది అంత దూరము పెద్ద వయసు వారు నడవలేక ట్రాఫిక్ లో   నానా అవస్థలు పడవలసి వస్తుంది

       కావునతమరు మా యందు దయవుంచి ప్రజా ప్రతినిధులుగా ఈ యొక్క బంగారయ్య కొట్టు సందు ఎదురుగా ఉన్న డివైడర్ కు కాళీ ఏర్పాటు చేయగలరని తమకు విజ్ఞప్తి చేస్తున్నాము

      48వ డివిజన్ ప్రజలు