పేద మహిళల మెడలో పుస్తెలు తెగుతున్న మా విధానమే కరెక్టు : జగన్
మహిళ పేద వర్గాల మెడలో పుస్తెలు తెగుతున్న తమ విధానమే గొప్పది అన్న _ జగన్
విజయవాడ- జన చైతన్య (తమ్మిన గంగాధర్ )
సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం ,జనసేన ,భారతీయ జనతా పార్టీల కూటమి అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్దేశించి బోండా ఉమా మాట్లాడుతూ మద్యపాన నిషేధంతో జగన్ లక్ష కోట్లు లూటీ చేశారు. అని విమర్శించారు. మద్యపాన నిషేధం పేరుతో జగన్ రెడ్డి లక్ష కోట్లు లూటీ చేశారు.కల్తీ మద్యంతో వేల మంది మహిళల మంగళసూత్రాలను తెంచిన వ్యక్తి జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. జే బ్రాండ్ల ద్వారా దోచుకున్న లక్షల కోట్ల డబ్బును కంటెనర్ల ద్వారా ఎన్నికలకు వైసీపీ నాయకులు తరలించారు అని విమర్శించారు. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వమే మద్యం అమ్మేలా చర్యలు చేపట్టారు ఇది నిజం కాదా అని నిలదీశారు. 2020 లో క్రిసిల్ చేసిన సర్వే ప్రకారం ఏపీలో దాదాపు 34.5 % మంది మద్యం సేవిస్తున్నారని తేలింది.2021 లో నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వేలో కూడా ఏపీలో దాదాపు 31.4 % మంది మద్యం సేవిస్తున్నారని స్పష్టం అయ్యింది.మద్యపాన నిషేధంపై హామీ ఇచ్చిన జగన్ రెడ్డి నేటికీ ఒక్క డీ- అడిక్షన్ సెంటర్ ని కూడా ప్రారంభించలేదు అన్నారు
ఐదేళ్లలో మద్యం సేవించే వారి సంఖ్య పెరిగిందే కానీ తగ్గిన ధాఖలాలు లేవు. మద్యం మాఫియా ద్వారా "జె గ్యాంగ్ " లక్ష కోట్లను అప్పనంగా కొట్టేసింది అని విమర్శించారు. జగన్ రెడ్డి లక్షల కోట్లు అవినీతి చేయడం కోసమే మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్లను నిషేధించారు.జగస్ హయాంలో మద్యం బ్లాక్ మార్కెట్ లో విచ్చలవిడిగా సరఫరా అవుతోంది ఇదేనా మధ్య పాన నిషేధాన్ని దశలవారీగా అమలపరచటం జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నించారు. మద్యం బ్లాక్ మార్కెట్ అమ్మకాల డబ్బు అంతా తాడేపల్లి ప్యాలెస్ కు తరలిపోతుంది. జగన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి మద్యం వ్యాపారంలో ఆరితేరి పోయారు. ఆయన రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలను నియంత్రిస్తున్నారు అని విమర్శించారు.
ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి కనుసన్నలోనే రాష్ట్రంలో మద్యం మాఫియా అరాచకాలు నడుస్తున్నాయి. ఎన్నికల సమయంలో అక్రమంగా వైకాపా అభ్యర్థులకు మద్యం సరఫరాకు ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ప్రణాళికలు రచించారు.ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిని విధుల నుంచి తొలగించాలి. నిబంధనలకు విరుద్ధంగా 9 నవంబర్ 2021న రాత్రికి రాత్రే 312, 313 జీవోలను తీసుకుని వచ్చారు.మద్యం అమ్మకాల మీద వచ్చే ఆదాయాన్ని కూడా జగన్ రెడ్డి మరో ఇరవై ఏళ్లకు తాకట్టు పెట్టాడు అన్నారు
అంటే వచ్చే 20 ఏళ్ల వరకు మద్యపాన నిషేధం అమలు కాకుండా చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. జాతీయ, ఆర్ అండ్ బీ రహదారులకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదనే సుప్రీం కోర్టు ఉత్తర్వులను కూడా జగన్ ప్రభుత్వం భేఖాతరు చేసింది అని విమర్శించారు. జగన్ రెడ్డి జే బ్రాండ్ కారణంగా జంగారెడ్డి గూడెంలో 25 మంది మరణించారు వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి, జగన్ ట్రబుల్ ఇంజన్ సర్కార్ పోయి ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ రావడం తథ్యం అని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఘంటా కృష్ణమోహన్ పాల్గొన్నారు.