సెంట్రల్ నియోజకవర్గం లో 25డివిజన్లో అభివృద్ధి వైసీపీ పార్టీతోనే జరిగింది-మళ్లీ శీను అన్న రావాలి
సెంట్రల్25వ డివిజన్ లో ఓట్లు అభ్యర్థించిన వెలంపల్లి
విజయవాడ-జన చైతన్య (తమ్మిన గంగాధర్)
సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు,మంగళవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 25వ డివిజన్ చుట్టూగుంట ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ బంకా శంకుంతల, భాస్కర్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్ధించారు.ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వెయ్యాలని అభ్యర్ధించారు.ఈ సందర్బంగా వెలంపల్లి మాట్లాడితూ డివిజన్ పర్యటనలో భాగంగా 25వ డివిజన్ పరిధిలో పర్యటించడంజరిగిందన్నారు.ప్రతి ఇంట్లో సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందాయన్నారు.సీఎం జగన్ మళ్ళీ గెలిస్తేనే పథకాలు వస్తాయని స్థానికులు చెబుతున్నారన్నారు.అభివృద్ధి అంటేనే సీఎం జగన్ అని కొనియాడారు.డివిజన్ అంత సిమెంట్ రోడ్లు వేసాం అని అన్నారు.ప్రతి ఇంట్లో ఘన స్వాగతంపలుకుతున్నారన్నారు.అన్ని విధాలా నియోజకవర్గం అభివృద్ధి కృషి చేస్తాం అని తెలిపారు. బోండా ఉమా నీ డిపాజిట్ లేకుండా ఒడిస్తాఅనిసవాలువిసిరారు.రౌడీయిజానికిగుండాయిజానికి కాల్ మనీ సెక్స్ రాకెట్ కి బైక్ రేస్ లకి బోండా ఫ్యామిలీ కేరఫ్ అడ్రెస్ అని అన్నారు.బోండా ఉమా తో ప్రజలకు పని లేదన్నారు.ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ సీనియర్ నాయకులు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.