ఎన్నికల కోడ్ ఉల్లంఘన

పుట్లూరు మండలంలో యథేచ్ఛంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన.(పుట్లూరు జనచైతన్య న్యూస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి వారం రోజులు అవుతున్న అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో పుట్లూరు మండల కేంద్రంలో ప్రభుత్వాధికారులు అధికార పార్టీ వైకాపా సేవలో తరలిస్తున్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో సచివాలయం ఎదురుగా కాలనీ వైయస్సార్ పేరుతో ఉన్న నేమ్ బోర్డు ను ఇప్పటికే తొలిగించడంలేదు. అలాగే చెత్త నుండి సంపద తయారీ కేంద్రంలోని స్థానిక వైకాపా పార్టీ రంగులు రోజుకు దర్శన మిస్తున్నాయి.అంతేకాకుండ ఎమ్మెల్యే ,ఎంపీ, అభివృద్ధి పనులు వేసిన శిలపలకలు కూడా ఆ వైకాపా పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల, పేర్లు రంగులతో దర్శనమిస్తున్నాయి.ఇప్పటికైన అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.