సూపర్ సిక్స్ ప్రజలకు అవగాహన
సూపర్ సిక్స్ పై ప్రజలకు అవగాహన.(పుట్లూరు జనచైతన్య న్యూస్) పుట్లూరు మండల కేంద్రంలో యూత్ ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలపై యూత్ మండల అధ్యక్షుడు వి.రవి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యూత్ మండల అధ్యక్షుడు రవి మాట్లాడుతూ సూపర్ సిక్స్ ప్రచారంలో భాగంగా బుధవారం గ్రామాలలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. ప్రతి గ్రామాల్లో అభివృద్ధి చెందాలంటే టిడిపి అభ్యర్థి బండారు శ్రావణిని గెలిపించాలని కోరారు. అంతేకాకుండా వైసిపి పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయమని పుట్లూరు యూత్ మండల అధ్యక్షుడు వి.రవి తెలిపారు.