బీసీలంతా ఏకధాటిపై వచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం
*బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం*
*బీసీలను అణగదొక్కిన జగన్ ను ఇంటికి పంపుదాం*
*జయహో బీసీ సదస్సులో పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మగారు..*
పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం కేంద్రం చౌడేశ్వరి కళ్యాణ మండపం నందు క్లస్టర్ ఇంచార్జీ రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన "జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ గారు మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించలేదని విమర్శించారు. బీసీలు బలహీనులు కాదని, వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామన్నారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తాం. పెన్షన్‌ను నెలకు రూ.4 వేలకు పెంచుతాం.బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం .స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ను వైసీపీ ప్రభుత్వం
34 శాతం నుండి 24 శాతానికి తగ్గించి, 16,800 పదవులు దూరం చేశారు. అధికారంలోకి వచ్చాక 34 శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం.జగన్‌రెడ్డి ‘ఆదరణ’ లాంటి 30 పథకాలు రద్దు చేశారు. రూ.5000 కోట్లతో ‘ఆదరణ’ పరికరాలిస్తాం.చంద్రన్న బీమా రూ.10 లక్షలతో పునరుద్దరిస్తాం. పెళ్లి కానుకలు రూ.లక్షకు పెంపు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు గారు అమలు చేస్తారని తెలియజేసిన *పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు* ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, బీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
*పెన్షన్ల పంపిణీ జాప్యానికి ప్రభుత్వ బాధ్యత వహించాలి* .
పెన్షన్ల పంపిణీ జాప్యానికి ప్రభుత్వమే కారణమని సవితమ్మ విమర్శించారు. పెన్షన్లు 3వ తారీకు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వలేకపోతున్నది వాలంటీర్ల మీద సాకులు చెప్పడం ప్రతిపక్షాలపై బురద జల్లడం అధికార పార్టీకి అలవాటయింది. మూడవ తారీకు అయిన రాష్ట్ర ప్రభుత్వము అవ్వ తాతలకు ఇవ్వాల్సిన పెన్షన్ల మొత్తాలను జమ కాలేక పంచాయతీ కార్యదర్శులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము అనుసరిస్తున్న వారి యొక్క అలసత్వం కారణంగా పెన్షన్ల పంపిణీకి ఆలస్యమైనందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడకుండా తెలుగుదేశం పార్టీ మీద నెపం నెట్టడం మంచిదికాదని ఇంతవరకు నగదు జమ కాక పంచాయతీ కార్యదర్శి తలలు పట్టుకొని చింతిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమేమో 3వ తారీఖున ఇస్తామని సచివాలయం దగ్గర ఇస్తామని ఆర్భాట ప్రకటనలు చేస్తున్నారే తప్ప నిధులు జమ చేయడం లేదని ఈ యొక్క తప్పును రాష్ట్ర ప్రభుత్వము సరిచేసుకోకుండా టిడిపి మీద నెట్టడం అవ్వ తాతలను వికలాంగులను వృద్ధులను ఏడిపించడం మంచిది కాదని వారి యొక్క ఓటు బ్యాంకు ను మలుచుకోవడానికి వారిలో ప్రతిపక్షాల మీద ద్వేషం పుట్టడానికి కావాలనే ఆలస్యం చేస్తున్నదని ప్రజలందరూ గమనిస్తున్నారని ,వీటిని విపరీతమైన దుష్ప్రచారం చేయకుండా ఇవ్వాల్సిన పెన్షన్లను త్వరగా నిధులు జమ చేసి పంపిణీ చేస్తే సమస్య ఉండదని రాజకీయాల కోసం వికలాంగులను వాడుకోవడం మంచి పద్ధతి కాదని వెంటనే పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన *పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సవితమ్మ గారు....*