ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి చేతుల మీదుగా బి ఫారం అందుకున్న దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి
ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల రెడ్డి చేతుల మీదుగా బి ఫారం అందుకున్న పుట్టపర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాదిరెడ్డి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకముంచి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసిన వై ఎస్ షర్మిల,డాక్టర్ రఘువీరారెడ్డి,సహకరించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరికీ అలాగే డిఎంఎస్ఆర్ టీం కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయనని రాబోయే రోజుల్లో నిబద్దమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటానని షర్మిలమ్మకు మాట ఇచ్చాను అని తెలియజేశారు.