తక్షణమే బీఈడీ కౌన్సిలింగ్ నిర్వహించాలి

తక్షణమే బీఈడీ కౌన్సిలింగ్ నిర్వహించాలి

తక్షణమే బిఈడి కౌన్సిలింగ్ నిర్వహించాలి 

విజయవాడ - జనచైతన్య (తమ్మిన గంగాధర్ )

పిడిఎస్ యు డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం 2023- 24 విద్యా సంవత్సరంలో నిర్వహించిన ఎడ్ సెట్  ఫలితాలను 2023 జులై 14 న ప్రకటించి నేటికీ 6 నెలలు కావస్తున్నా కౌన్సిలింగ్ నిర్వహించలేదని అర్హత సాధించిన పదివేల తొమ్మిది వందల ఎనిమిది మందికి తక్షణమే కౌన్సిలింగ్ నిర్వహించాలని పిడిఎస్ యు  నగర కార్యవర్గం ఆధ్వర్యంలో సోమవారం ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డి ఆర్ ఓ ఎస్ .వి. నాగేశ్వరరావు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పిడిఎస్ యు నగర అధ్యక్షకార్యదర్శులు పి. వైష్ణవ్, ఆర్. వేణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని హెడ్సెట్లకు కౌన్సిలింగ్ నిర్వహించింది.ఇప్పటికే క్లాసులుప్రారంభమైనవి. కానీ ఎడ్ సెట్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రారంభించకపోవడం వల్ల పదివేల తొమ్మిది వందల ఎనిమిది మంది ఈ విద్యా సంవత్సరం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా కౌన్సెలింగ్ తక్షణమే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు నాయకులు మణికంఠ, జి. దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .  ఆర్. వేణు

 పిడీఎస్యు -నగర కార్యదర్శి