కదిరి హిందూపురం రోడ్లు ప్రమాదాలను అరికట్టాలి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కదిరప్ప

కదిరి హిందూపురం రోడ్లు ప్రమాదాలను అరికట్టాలి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కదిరప్ప
జనచైతన్య న్యూస్- కదిరి
సత్యసాయి జిల్లా లోని గోరంట్ల నుండి కదిరి వరకు నాలుగు లైన్ల ప్రధాన రహదారి విస్తరణ లో భాగంగా నిత్యం అనేక భారీ వాహనాల సైతం ఈ ప్రధాన రహదారి పైనే ప్రయాణం చేయాల్సిందే అయితే దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుండి ఈ ప్రధాన రహదారి పనులు చేపట్టారు. ఈ రోడ్డు మార్గం లో వర్షం పడితే చాలు గుంతలలో నీరు నిల్వ ఉండి బురద మయంగా మారి ఎటు వైపు ఏ గుంతలు ఉన్నాయ్యో తెలియక వాహన దారులు అతలాకుతలం అవుతున్నారు. రాత్రి అయితే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్ళాలిసిందే రోడ్లకి ఇరువైపులా ఎక్కడికక్కడే మట్టి, కంకర, గుంతలు ఉండడమే ప్రమాదాలకు కారణమన్నారు.సరైన సూచిక బోర్డు లు లేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గత వారం క్రిందట హిందూపురం నుండి కదిరి కి కారులో ప్రయాణిస్తున్న ఒక లేడీ డాక్టర్ ప్రమాదానికి గురియ్యిందని కారులో ఎయిర్ బాగ్స్ తెరుచు కోవడం తో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదన్నారు.ఇలాంటి వి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయని పునరావృతం కాకుండా సరైన సూచిక బోర్డు లను, నాణ్యమైన తాత్కాలిక వన్ వే రహదారిని వేసి వాహన దారులకు ప్రమాదాల నుండి అరికట్టాలని ఆర్ అండ్ బి అధికారులకు కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కదిరిప్ప ప్రజల పక్షాన కోరారు.