వైసీపీ నుంచి టీడీపీలోకి 35 కుటుంబాలు చేరిక
వైసీపీ నుంచి టీడీపీ అడుగు జాడలో చేరీన 35 కుటుంబాలు.(పుట్లూరు జనచైతన్య న్యూస్) మండల పరిధిలోని గరుగు చింతలపల్లి గ్రామానికి చెందిన వైసిపి నుంచి 35 కుటుంబాల టిడిపి లోకి చేరారు. ఇందులో భాగంగా మండల నాయకులు కులశేఖర్ రెడ్డి, ఆధ్వర్యంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరారు. అదేవిధంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి నాయకులకు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి టిడిపిని ఇలాగే ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలన్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ తెలుసుకోనే రోజు దగ్గరలోనే ఉందని తెలిపారు.ఈ వైసిపి ప్రభుత్వానికి ఓటమి తప్పదన్నారు.