బోండా ఉమా విజయమే లక్ష్యం - సుంకర కబాడీ శీను
బోండా ఉమామహేశ్వరరావు
విజయమే లక్ష్యం.
విజయవాడ _జన చైతన్య (తమ్మిన గంగాధర్)
అమరావతి రాష్ట్ర కాపునాడు
విజయవాడ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో విజయవాడ మధ్య నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విజయమే లక్ష్యంగా అమరావతి కాపునాడు పనిచేస్తుందని అమరావతి రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు (కబాడీ శ్రీను) అన్నారు. గవర్నర్ పేటలోని నూతన కార్యాలయాన్ని ఆదివారం బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కబాడీ శ్రీను మాట్లాడుతూ కాపు సామాజిక వర్గం మొత్తం బోండా ఉమా వెంట ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కాపు సామాజిక వర్గం ఎన్నో రకాలుగా నష్టపోయిందన్నారు. ఇటువంటి ప్రభుత్వానికి రాష్ట్రంలోని కాపులు ఎవరూ మద్దతు పలకడం లేదని చెప్పారు. అనంతరం టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గంతో పాటు బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలన్నీ జనసేన, టిడిపి కలయికను ఆహ్వానిస్తున్న క్రమంలో కాపు సామాజిక వర్గం ఆయా వర్గాల నాయకులతో సమన్వయం చేసుకొని రాష్ట్రంలో టిడిపి, జనసేన నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి చేయాలని కోరారు. అమరావతి కాపునాడు గౌరవ అధ్యక్షులు బేతు రామ్మోహన్రావు మాట్లాడుతూ దివంగత ప్రజా నాయకులు వంగవీటి మోహన రంగా ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉమామహేశ్వరరావు లాంటి వ్యక్తులను శాసనసభ్యులుగా గెలిపించుకుని అసెంబ్లీకి పంపించడం ద్వారా రాష్ట్రంలో కాపు సామాజివర్గానికి ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కాపులతో పాటు ఇతర బీసీ వర్గాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆయా వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసిన మాజీ ముఖ్యమంత్రి, దార్శనికుడు నారా చంద్రబాబునాయుడు, నీతి, నిజాయితీకి మారుపేరుగా ఉన్న పవన్ కళ్యాణ్ లు పొత్తు పెట్టుకున్నది అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకేనని రాష్ట్ర ప్రజలు గమనించారన్నారు. వీరిరువురిలో ఏ ఒక్కరికి వ్యక్తిగత స్వార్థం లేదన్నారు. అమరావతి రాష్ట్ర కాపునాడు కూడా ఈ దిశగానే ఆలోచించి రాష్ట్రంలో 26 జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, అడపా ప్రతాప్ చందు, పిళ్లా శ్రీదేవి, ఆళ్లమళ్ల సుబ్రహ్మణ్యం, చలమలశెట్టి కోటేశ్వరరావు, ముత్యాల రమేష్, జయ, ఎం.ఎన్.ఎం స్వామి, మామిడి సత్యం, రాంబాబు, బి.పి. వెంకటేశ్వర్లు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.